Oct 28,2021 18:07

జెడ్‌పిటిసి ఛాంబర్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు

కొత్తవలస : ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్‌.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సూచించారు. గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయం ఆవరణలో జెడ్‌పిటిసి సభ్యుల ఛాంబర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం కోసం వ్యక్తిగత కార్యాలయం అవసరమన్నారు. అనంతరం స్థానిక జెడ్‌పిటిసి నెక్కల శ్రీదేవి తన ఛాంబరులో కొలువుదీరారు. ఆంజనేయపేట వద్ద గల చైతన్య మానసిక పాఠశాలలో పనిచేస్తున్న భోజంకి అప్పలనాయుడుకు సిఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్‌ నెక్కల నాయుడుబాబు, ఎఎంసి చైర్మన్‌ ఎం.కస్తూరి, వైస్‌చైర్మన్‌ బి.వెంకటరావు, వైస్‌ ఎంపిపి మెలాస్ట్రీ సరస్వతి, పిఎసిఎస్‌ అధ్యక్షుడు గొరపల్లి రవికుమార్‌ ఎంపిడిఒ గంట వెంకటరావు, ఎల్‌.కోట ఎంపిపి గేదల శ్రీనివాసరావు, జెడ్‌పిటిసి తూర్పాటి వరలక్ష్మి, ప్రముఖ వైద్యులు ఆర్‌.దిలీప్‌ కుమార్‌, పార్టీ మండల కన్వీనర్‌ మెలాస్ట్రీ అప్పారావు, పలువురు ఎంపిటిసిలు, సర్పంచులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.