Jun 11,2021 09:07
  • 1921లో ఏర్పాటు
  • ఆర్థికరంగంపై ప్రధాన దృష్టి

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ప్రభుత్వాల ఆర్ధిక వ్యవహారాలను సమీక్షించి... తగు సూచనలు చేసే ప్రజా పద్దుల కమిటీ (పబ్లిక్‌ అక్కౌంట్స్‌ కమిటీ) అటు కేంద్రంలో ఇటు రాష్ట్రాల్లో అత్యంత కీలకమైంది. ఈ కమిటీ సిఫార్సులు ఆర్ధిక పాలనకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. బ్రిటిష్‌ పాలనలో 1921లో ఏర్పాటైన ఈ కమిటీ ఈ ఏడాది వంద సంవత్సరాలను పూర్తి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే పార్లమెరట్‌ ఈ ఏడాది నవంబర్‌ చివరిలో లేదా డిసెంబర్‌ తొలి వారంలో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అన్ని రాష్ట్రాల శాసనసభల్లో అమలులో ఉన్న పిఎసిల జ్ఞాపికలతో ఒక సావనీర్‌ను కూడా విడుదల చేయనుంది.
 

                                                                      ఇలా ఏర్పాటైంది ...

   బ్రిటిష్‌ పాలనలో ఉన్న భారతదేశంలో 1917లో మారటెగ్‌ పర్యటించి అప్పటి వైశ్రారు క్లెమర్డ్‌, ఇతర దేశీయ నాయకులతో భేటీలు నిర్వహించారు. దేశంలో పరిమిత స్వపరిపాలన, మైనార్టీ వర్గాల రక్షణ వంటి అంశాలపై చర్చించారు. భూపేంద్రనాధ్‌ దాస్‌, బ్రిటిష్‌కు చెందిన డ్యూక్‌, ఛార్ల్లెస్‌ రాబర్ట్స్‌ వంటి వారితో చర్చల అనంతరం ఒక నివేదిక సిద్ధం చేశారు. ఈ నివేదికను 1918 మే నాలుగో తేదీన అప్పటి బ్రిటిష్‌ మంత్రివర్గం ఆమోదించి, భారత చట్టంలో కూడా పొందుపరిచారు. ఈ సమయంలోనే కేంద్ర, ప్రాంతీయ శాసనసభలకు కొన్ని అధికారాలను కూడా కట్టబెట్టారు. మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. 1919లో కేంద్ర, ప్రాంతీయ పాలన కోసం కొన్ని హక్కులను, బాధ్యతలు నిర్వచించారు. కేంద్రం వద్ద రక్షణ, విదేశీ వ్యవహారాలు, టెలిగ్రాఫ్‌, రైల్వే, పోస్టల్‌, వాణిజ్యం వంటి రంగాలను ఉంచగా, ప్రాంతీయ పాలనలో ఆరోగ్యం, పారిశుథ్యం, విద్య, నీటిపారుదల, జైళ్లు, పోలీసు వంటి రంగాలను కేటాయించారు. ఇదే సమయంలో పాలనా వ్యవహారాల్లో అవకతవకలను నివారించేందుకు ప్రజా పద్దుల కమిటీని కూడా ఏర్పాటుచేయాలని మారట్‌-ఫోర్డ్‌ సిఫార్సులు చేసింది. ఈ సిఫార్సు లను 1921లో అమలు చేసి మొట్టమొదటిసారిగా ప్రజా పద్దుల కమిటీని ఏర్పాటు చేశారు.
 

                                                                1967 వరకు స్పీకరే ఛైర్మన్‌

   స్వాతంత్య్రం వచ్చాక కొన్నేళ్లపాటు కేంద్ర ఆర్ధిక మంత్రే దీనికి చైర్మన్‌గా వ్యవహరించగా, తరువాత కాలంలో 1967 వరకు లోక్‌సభ స్పీకర్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. ఆ తరువాత నురచి చైర్మన్‌ పదవిని ప్రతిపక్షానికి ఇచ్చే సాంప్రదాయం ప్రారంభమై ఇప్పటికీ అదే కొనసాగుతోంది. 1955 వరకు లోక్‌సభ నురచి 15 మంది సభ్యులతో ఈ కమిటీ పనిచేయగా, తరువాత కాలంలో రాజ్యసభ నుంచి కూడా మరో ఏడుగురు సభ్యులను నియమించడంతో మొత్తం కమిటీ సభ్యుల సంఖ్య 22 కి చేరుకుంది. ప్రజాపద్దుల కమిటీ ప్రధానంగా ఆర్ధికపరమైన అంశాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తోంది. పలు రంగాలకు కేటాయింపులు, వాటిపై జరిగిన వ్యయం, కార్పొరేషన్లు, వాటి పరిస్థితిని పిఎసి అధ్యయనం చేసి నివేదికలు సిద్ధం చేస్తుంది. అలాగే పలు రంగాల పరిస్థితిపై కాగ్‌ ఇచ్చిన నివేదికలను కూడా పిఎసి చర్చిస్తుంది. పార్లమెరట్‌లో ఆమోదించిన బడ్జెట్‌ను ఆయా శాఖలు డిమాండ్ల మేరకు ఖర్చు చేస్తున్నాయా లేదా అన్నది పరిశీలించే అధికారం కూడా పిఎసి పరిధిలోకి ఉంటుంది. ఒక శాఖలో ఒక పనికి కేటాయించిన నిధులు పక్కదారిలో వేరే శాఖలకు ఖర్చు చేస్తే వాటిని కూడా సమీక్షిస్తుంది. ఆర్ధిక క్రమశిక్షణపై చర్చ కూడా పిఎసి అధికారాల్లో కీలకంగాఅ- ఉంటుంది.
 

                                                                          తొలి చైర్మన్‌ హేలీ

   ప్రజాపదు ్దల కమిటీ ఏర్పాటైన తరువాత తొలి చైర్మన్‌గా 1922లో డబ్ల్యుఎం హేలీ నియమితులయ్యారు. తరువాత మూడో చైర్మన్‌గా భారతదేశానికి చెందిన భూపేంద్రనాధ్‌ మిత్రా 1928 లో పనిచేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1947లో తొలి చైర్మన్‌గా ఆర్‌కె షణ్ముకం చెట్టి చైర్మన్‌గా వ్యవహరించారు. ఆ తరువాత కాలంలో ఈ పదవిలో పనిచేసిన వారిలో మాజీ ప్రధానమంత్రులు అటల్‌ బిహారీ వాజ్‌పాయి (1969-71, 1991-93), పివి నరసింహారావు (1978-79), మాజీ రాష్ట్రపతి ఆర్‌ వెంకట్రామన్‌ (1979-80) పనిచేశారు.
 

                                                                       తెలుగు వాళ్లు కూడా

   అత్యంత కీలకమైన పిఎసి చైర్మన్‌ పదవిలో ముగ్గురు తెలుగు వాళ్లు కూడా పనిచేయడం విశేషం. మాజీ ప్రధాని పివి నరసిరహారావుతోపాటు 1958-59 మధ్య కాలంలో ఎన్‌జి రంగా, 2002లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి పనిచేశారు.