Oct 27,2021 22:17

ప్రజాశక్తి-తిరువూరు : స్థానిక నగర పంచాయతీ కౌన్సిల్‌ సమావేశం చైర్‌పర్సన్‌ గత్తం కస్తూరిభారు అధ్యక్షతన బుధవారం జరిగింది. టిడిపి కౌన్సిలర్లు షేక్‌ అబ్దుల్‌ హుస్సేన్‌, నాళ్లా సురేంద్ర ప్రజా సమస్యలను కౌన్సిల్‌ దష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా కుక్కలు, కోతులు, పందులు, పశువులు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయని, వీటివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే నివారణకు చర్యలు తీసు కోవాలని చైర్‌పర్సన్‌ను కోరారు. పట్టణంలో వివిధ ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగటం లేదన్నారు. సరైన డ్రయినేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు ఎక్కడపడితే అక్కడ నిల్వ ఉండి దోమలకు నిల్వకేంద్రాలుగా మారాయన్నారు. పట్టణ ప్రజలకు అవసరాలకు ఓపెన్‌ టాయిలెట్లు అందరికీ అనువుగా ఉండే ప్రదేశంలో నిర్మించాలని కోరారు. ఈసమావేశంలో కమిషనర్‌ శర్మ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.