Oct 28,2021 19:29

buntumilli lo rally

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం
సిపిఎం తూర్పుకృష్ణా కార్యదర్శి ఆర్‌.రఘు
ప్రజాశక్తి-బంటుమిల్లి
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయాలని సిపిఎం తూర్పుకృష్ణా కార్యదర్శి ఆర్‌.రఘు పిలుపునిచ్చారు. సిపిఎం బంటుమిల్లి మండల మూడో మహాసభ పోసిన మోహనరావు నగర్‌లో వెంట్రపాటి గంగా నాగేశ్వరరావు ప్రాంగణంలో జరిగింది. బంటుమిల్లిలో ట్రాఫిక్‌ సమస్య నివారించాలనీ, బైపాస్‌ రోడ్డు విస్తరణ చేయాలని అధికారులను కోరుతూ తీర్మానించింది. మంచినీటి సమస్య పరిష్కారానికి మల్లేశ్వరం వాటర్‌ స్కీమును ఫిల్టర్‌ బెడ్లను ఏర్పాటుచేయాలనీ, పెద్ద తుమ్మిడి మురుగు డ్రైనేజీ సమస్య పరిష్కరించాలనీ, డ్రైనేజీపై వంతెన నిర్మించాలని విజ్ఞప్తిచేసింది. మాజేటి శివ శ్రీనివాసరావును మూడోసారి కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పది మంది మండల కమిటీ సభ్యులతో మండల కమిటీ ఏర్పాటైంది.సిపిఎం తూర్పుకృష్ణా కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌ రవి పరిశీలకులుగా హాజరయ్యారు. సిపిఎం మండల కమిటీ సభ్యులు గౌరీశెట్టి నాగేశ్వరరావు, అజరు ఘోష్‌, ధనశ్రీ మాజేటి పద్మ, సుజాత, వెంకన్న, బొడ్డు నాగరాజు, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.