
ప్రజాశక్తి-రాజోలు 'విరమణ ఉద్యోగానికే తప్ప, ప్రజాసేవకు కాదని ఉభయ గోదావరి జిల్లాల ఎంఎల్సిలు రాము సూర్యారావు, ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు.' ఆదివారం స్థానిక రోటరీ క్లబ్ ప్రాంగణంలో యుటిఎఫ్ నాయుకులు చింతా దుర్గాప్రసాద్ ఉద్యోగ విరమణ అభినందన సభ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఎల్సిలు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికీ ఉద్యోగ విరమణ తప్పదన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదని కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయులపైనే ఉంటుందన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించిన ప్రతి ఒక్కరూ విద్యార్థుల గుండెల్లో చిరకాలం నిలిచేలా విద్యను బోధించాలన్నారు. స్థానిక ఎంఎల్ఎ రాపాక వరప్రసాదరావు మాట్లాడుతూ ప్రభుత్వోద్యోగాల్లో ఉపాధ్యాయవృత్తి ఉత్తమమైందని తెలిపారు. బిల్లు కలెక్టర్ నుంచి మొదలుకొని దేశ ప్రధాని వరకు ఉపాధ్యాయుల చేతిలోనే చదువుకున్నారని పేర్కొన్నారు. అనంతరం దుర్గాప్రసాద్ దంపతులకు సన్మానపత్రం ఇచ్చి పూల మాలలు, శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో రాజోలు ఎంఇఒ జొన్నలగడ్డ గోపాలకృష్ణ, యుటిఎఫ్ నాయకులు నల్లి విశ్వనాధ్, బి.శ్రీనివాస్, ఎ.కాశీ, కామేశ్వరరావు, యు.శ్రీనివాస్, కేశవరావు పాల్గొన్నారు.