Jul 30,2021 21:08

ప్రజాశక్తి-తిరువూరు : ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నును నిర్ణయించే విధానాన్ని రద్దుచేయాలని, చెత్త పన్నును నిలుపుదల చేయాలని కొరుతూ తిరువూరు పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్యర్యంలో నిర్వహించిన ప్రజా బ్యాలెట్‌కు పట్టణ ప్రజల నుండి విశేషస్పందన లభించింది. పౌర సంక్షేమ సంఘం నాయకులు, కార్యకర్తలు తిరువూరు మెయిన్‌ రోడ్‌లో ప్రతి షాప్‌ కెళ్లి పన్ను భారల గురించి వివరించి దీనికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మొత్తం 902 మంది ఓటు హక్కును వినియోగించుకోగా ఇంటి పన్నుపెంపుదలను 878 మంది వ్యతిరేకిస్తూ, 11మంది సమర్థిస్తూ ఓట్లు వేయగా 13 మంది ఓట్లు చెల్లలేదని తిరువూరు పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి మేకల నాగేంద్ర ప్రసాద్‌ తెలిపారు. అనంతరం ప్రజల నుండి వ్యతిరేకతను వినతిపత్రంలో నగర పంచాయతీ కమిషనర్‌ శర్మకు అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొత్త పల్లి సుందరరావు, మీనుగు శ్రీనివాసరావు, కె.పా పారావు, ఎస్‌.వి.భద్రం, ఆకుల రవి, తదతరులు పాల్గొన్నారు.