Oct 28,2021 16:19

పరిశుభ్రమైన తాగునీరు అందిస్తా

ప్రజాశక్తి- ఏర్పేడు : ఏర్పేడు గ్రామపంచాయతీలోని ప్రజలకు పరిశుభ్రమైన తాగు నీరు అందించేందుకు కషి చేస్తానని ఏర్పేడు సర్పంచ్‌ నల్ల పాలెం శివయ్య స్పష్టం చేశారు. గురువారం ఆయన ఏర్పేడులోని పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉన్న తాగునీటి ట్యాంకు, ప్రాథమిక పాఠశాల వద్ద ఉన్న వాటర్‌ ట్యాంకు పరిశుభ్రం చేయించారు. ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ గ్రామస్తులకు పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు పారిశుధ్య కార్మికులచేత రెండు వాటర్‌ ట్యాంక్‌లను శుభ్రం చేయించడం జరిగిందని అన్నారు.