Sep 20,2021 00:56

కౌంటింగ్‌ను పరిశీలిస్తున్న జెసి

స్థానిక ఎన్నికల్లో కాకినాడ, పెద్దాపురం డివిజన్లలో పలుచోట్ల ఫలితాలు ఇలా ఉన్నాయి.
ప్రజాశక్తి-యంత్రాంగం

కరప మండలంలోని 22 ఎంపిటిసిలకుగాను 11 వైసిపి గెలుచుకోగా, 4 జనసేన, 1 టిడిపి గెలుచుకున్నాయి. 6 స్థానాల్లో వైసిపికి ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం వైసిపి 17 స్థానాలు దక్కించుకుంది. వైసిపి జెడ్‌పిటిసి యాళ్ల సుబ్బారావు, జనసేన పార్టీ అభ్యర్థి భోగిరెడ్డి కొండబాబు మధ్య జనసేన అభ్యర్థిపై 3వేల ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. అడ్డతీగల్లో 11 ఎంపిటిసి స్థానాలకు గాను ఏడు స్థానాలు ఏకగ్రీవం కాగా నాలుగు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో వైసిపి అభ్యర్థులు పెద్ద మెజార్టీతో గెలుపొందారు. జెడ్‌పిటిసి అభ్యర్థి మద్దాల వీర్రాజు ప్రత్యర్థులపై సుమారు 7942 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఏలేశ్వరంలో ఎంపిటిసి ఎన్నికల్లో వైసిపి తన ప్రభావాన్ని చూపగా జనసేన, టిడిపిలు ఒక్క స్థానానికి పరిమితమయ్యాయి. వైసిపి తరపున రెండు స్థానాలు ఏకగ్రీవం కాగా, మర్రివీడు నుండి నాని శెట్టి శంకరమ్మ 769 ఓట్లు జె.అన్నవరం నుండి కాలరి గిరీష 1056 ఓట్లు, తూర్పు లక్ష్మీపురం నుండి ఇజనగిరి శివప్రసాద్‌ 935 ఓట్లు, లింగంపర్తి 1 నుంచి చిక్కాల రాజ్యలక్ష్మి దేవి 172 ఓట్లు, లింగంపర్తి 3 నుంచి అలమండ నాగు 961 ఓట్లు భద్రవరం నుంచి కొప్పుల బాబ్జి 245 ఓట్లు, పేరవరం నుంచి బొడ్డు మంగ 455, సిరిపురం నుంచి సాదే లోవరాజు 1122 ఓట్లు, ఎర్రవరం నుంచి బొడ్డు లక్ష్మణ స్వామి 1783 ఓట్ల ఆధిక్యం సాధించారు. లింగంపర్తి 2 నుంచి జనసేన అభ్యర్థి వరుపుల దుర్గావేణి 122 ఓట్లు, తిరుమాలి నుంచి టిడిపి అభ్యర్థి పసల సూరిబాబు 426 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఏలేశ్వరం జెడ్‌పిటిసి అభ్యర్థి నీరుకొండ రామ కుమారి 11261 ఆధిక్యతతో గెలుపొందారు. అనపర్తి ఎన్నికల ఫలితాల్లో వైసిపి అభ్యర్థులు విజయఢంకా మోగించారు. జెడ్‌పిటిసి అభ్యర్థి సత్తి గీత వరలక్ష్మి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అనపర్తి మండలంలోని 20 ఎంపిటిసి స్థానాలను వైసిపి అభ్యర్థులు కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతున్నాయి. 20 ఎంపిటిసి స్థానాలు, జెడ్‌పిటిసి స్థానాన్ని అధికార పార్టీ కైవసం చేసుకుని క్లీన్‌ స్వీప్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గంగవరం మండలంలో ఒక జెడ్‌పిటిసి స్థానానికి, ఏడు ఎంపిటిసి స్థానాలకు ఆదివారం జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో జెడ్‌పిటిసి స్థానాన్ని, వైసిపి అభ్యర్థి అచ్యుత బేబీరత్నం 2052 ఓట్ల మెజారిటీతో కైవసం చేసుకున్నారు. సామర్లకోట 12 మండలాలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్‌ ప్రశాంతంగా జరిగింది. పోలీసులు కౌంటింగ్‌ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు అయితే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్‌ ప్రక్రియ రాత్రి 8 గంటలకు కూడా పూర్తవలేదు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద అభ్యర్థుల ఓటింగ్‌ వివరాలను తెలిపే బోర్డు కౌంటింగ్‌ గదిలోనే వేయడంతో కౌంటింగ్‌ హాలు బయట ఉన్న ఉన్న వారికి సమాచారం అందకపోవడంతో కొంత మేర ఆందోళన చెందారు. పెద్దాపురం కౌంటింగ్‌ కేంద్రం వద్ద అధికారుల సమన్వయం లేకపోవడంతో కౌంటింగ్‌ ప్రక్రియలో జాప్యం జరిగింది. శంఖవరం మండలంలోని 16 స్థానాలకు 8 ఎంపిటిసి స్థానాలు ఏకగ్రీవం కాగా మరో 8 స్థానాలు వైసిపి విజయం సాధించింది. జెడ్‌పిటిసిగా వైసిపి అభ్యర్థి తుర్రం మల్లేశ్వరి విజయం సాధించారు. 14 వేల 668 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఏలేశ్వరం మండలంలో 13 స్థానాలకు పోటీ చేయగా 11 స్థానాల్లో వైసిపి, తెలుగుదేశం 1 జనసేన 1 విజయం సాధించాయి. జెడ్‌పిటిసి ఎస్‌టి మహిళకు రిజర్వు కాగా ఏజెన్సీ ప్రాంతం సిద్ధివారిపాలెం నుంచి పోటీ చేసిన తరుము రాజేశ్వరి తమ సమీప ప్రత్యర్థి పెదమల్లాపురం మాజీ జెడ్‌పిటిసి బచ్చల గంగపై 14668 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. శంఖవరం మండలం నుంచి కాబోయే మూడో తరం మండలాధ్యక్షుడు పర్వత గుర్రాజు ఎన్నిక ఎంఎల్‌ఎ పూర్ణ చంద్ర ప్రసాద్‌ ఆశీస్సులతో నామమాత్రవేనని అంటున్నారు. ప్రత్తిపాడులో 23 ఎంపిటిసి స్థానాలకు రాత్రి 8 గంటల సమయానికి వైసిపి 11 స్థానాల్లో విజయం సాధించింది. రౌతులపూడి మండలంలో 16 ఎంపిటిసి స్థానాలకు గాను రాత్రి 8 గంటలకు వైసిపి 10 స్థానాల్లో విజయం సాధించగా తెలుగుదేశం మూడు స్థానాల్లో విజయం సాధించింది. కోటనందూరు జెడ్‌పిటిసి ఎన్నికల్లో కోటనందూరు మండలంలో వైసిపి సంపూర్ణ విజయం సాధించింది. మండల పరిధిలో 14 ఎంపిటిసి స్థానాల్లోనూ విజయం విజయ దుందుభి మోగించింది. జెడ్‌పిటిసి అభ్యర్థి సత్యవేణి 18500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కోటనందూరు ఎంపిపిగా బిళ్లందూరుకు చెందిన ఎల్‌.శ్రీనును విప్‌ దాడిశెట్టి రాజా ఇప్పటికే ప్రతిపాదించారు. రాజవొమ్మంగిలో మండలంలో 11 ఎంపిటిసి స్థానాలకు గాను 8 ఎంపిటిసి స్థానాల్లో వైసిపి విజయం సాధించగా, రెండు ఎంపిటిసి స్థానాల్లో టిడిపి విజయం సాధించింది, బదనాంపల్లి, వాతంగి, తంటికొండ, లాగరాయి, చికిలింత, తంటికొండ, రాజవొమ్మంగి-1, రాజవొమ్మంగి-2 ఎంపిటిసి స్థానాల్లో వైసిపి అభ్యర్థులు విజయం సాధించగా, లబ్బర్తి, చెరుకుంపాలెం, ఎంపిటిసి స్థానాల్లో టిడిపి విజయం సాధించింది. జెడ్‌పిటిసిగా ఒడుగుల జ్యోతి సమీప టిడిపి అభ్యర్థిపై రెండు వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.