Oct 28,2021 19:04

kondaveeti venkatakumari narayanarao

ప్రగతిపథంలో నడిపించటానికి నిరంతర కృషి
కోడూరు ఎంపిపి కొండవీటి వెంకటకుమారి
ప్రజాశక్తి-కోడూరు
మండలాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి నిరంతరం కషి చేస్తున్నానని కోడూరు మండల పరిషత్‌ అధ్యక్షురాలు కొండవీటి వెంకట కుమారి చెప్పారు. కోడూరు మండలంలోని విశ్వనాథపల్లి గ్రామంలోని తమ స్వగహంలో ఆమె భర్త, కష్ణాజిల్లా రైతు విభాగ కార్యదర్శి కొండవీటి వెంకట నారాయణరావుతో కలసి ప్రజాశక్తికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ కొండవీటి వెంకట కుమారి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి, అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు సింహాద్రి రమేష్‌ బాబు, దివి మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ కడవకొల్లు నరసింహారావు ఆశీస్సులతో అభివృద్ధే ధ్యేయంగా కృషిచేస్తున్నానని చెప్పారు. కోడూరు మండలంలోని అన్ని గ్రామాల్లోని ప్రజలకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషిచేస్తానని చెప్పారు. ఆయా గ్రామాల్లోని ప్రజా ప్రతినిధులను కలుపుకుంటూ వెళ్తూ మండల అభివద్ధికి నిరంతరం కషి చేస్తానని చెప్పారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. రైతు విభాగంలో తన భర్తకూ, కోడూరు మండలం ఎంపీపీగా తనకు హోదాను కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబు, దివి మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ కడవకొల్లు నరసింహారావు, కోడూరు మండల ప్రజలకు ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు. కోడూరు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. గ్రామీణ రహదారుల అభివద్ధికి కషి చేస్తానని వివరించారు. తాగునీటి సమస్యలపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ప్రజలకు రక్షిత మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. పంచాయతీల్లోని మంచినీటి కుళాయిలు సక్రమంగా పనిచేసేలా నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా వచ్చేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డ్రెయినేజీల ఆధునీకరణకు ప్రాధాన్యత ఇస్తూ అధికారులతో సమన్వయంతో పనిచేసి పారిశుధ్యం మెరుగుదలకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. సిఎం జగన్‌ ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు అన్ని తరగతుల ప్రజలకు ఎంతోమేలు చేకూరుస్తున్నాయన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు, డ్వాక్రా మహిళలకు రుణాలు, వడ్డీ మాఫీ, రైతులకు రుణాల మాఫీ, పెట్టుబడి సాయం వంటి పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వివరించారు. నాడు-నేడు పథకం మొదటి, రెండో విడతల్లో ప్రభుత్వ పాఠశాలల సమగ్ర రూపాన్ని మార్చేయటం ద్వారా అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అమ్మఒడి పథకం ద్వారా పేదలు తమ పిల్లలను సక్రమంగా చక్కగా చదివిస్తున్నారన్నారు. మండలంలోని సమస్యల పట్ల తనకు అవగాహన ఉందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధలతో సమన్వయం చేసుకోవటం ద్వారా అభివద్ధి పనులకు శ్రీకారం చుడతామన్నారు. సాగునీరు, విద్యుత్తు తదితర సమస్యల పరిష్కారానికి కూడా ప్రాధాన్యత ఇస్తానన్నారు. కోడూరు మండలంలోని అన్ని గ్రామాల్లోని వైసిపి నాయకులు, ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో కోడూరు మండల్లాని జిల్లాలోనే ఆదర్శమండలంగా తీర్చిదిద్దటానికి తాను శాయశక్తులా కషిచేస్తానని వివరించారు. తన ఎదుగుదలకు తోడ్పాటు నందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. మండల ప్రజలకు రుణపడి ఉంటానని వివరించారు.