Oct 28,2021 15:51

ప్రజాశక్తి - ఆలమూరు
ప్రభుత్వ భవనాల కార్యాలయాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో తహశీల్ధార్‌ లక్ష్మీపతి, ఎంపిడిఓ ఝాన్సీ, మండల ఇంజినీర్‌ వీరభద్రరావు, ఇఒపిఆర్డీ రాజ్‌ కుమార్‌ల అధ్యక్షతన గురువారం సచివాలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుత్తేదారులతో పనులు త్వరితగతిన పూర్తి చేయించాలని ఆదేశించారు ఇప్పటికే నిర్మాణాలు చేపట్టి కాలాతీతం అయ్యిందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు సంజీవరెడ్డి, సత్యనారాయణ, రాజు, వీర్రాజు, సుబ్బారావు, విజయ రాజు, శివకుమార్‌, వీరమాత, శబరి, రేణుక, మోక్ష అంజలి, మంజరి, ఇంజనీరింగ్‌, డిజిటల్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.