Apr 11,2021 15:02

హైదరాబాద్‌ : యంగ్‌ రెబల్‌స్టార్‌.. డార్లింగ్‌ ప్రభాస్‌ ఇప్పుడు టాలీవుడ్‌కే కాదు..బాలీవుడ్‌, మాలీవుడ్‌, కోలీవుడ్‌ ఇండిస్టీస్‌కు పరిచయం అక్కర్లేని పేరు. బాహుబలితో అమాంతం రేంజ్‌ పెరిగిపోయిన ఈ పాన్‌ ఇండియన్‌ స్టార్‌... వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. రాధా శ్యామ్‌, ఆదిపురుష్‌, సాలార్‌తో పాటు... నాగ్‌ అశ్విన్‌ చిత్రంలో నటిస్తున్నారు. ప్రభాస్‌ షూటింగ్‌ పాల్గంటున్న ఫోటోలు లీకై నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా మునీశ్వరుని గెటప్‌లో ఉన్న ఫోటో ప్రస్తుతం హల్‌ చల్‌ చేస్తోంది.

ప్రభాస్‌ను ఈ కోణంలో చూశారా...! తెగ వైరల్‌ అవుతున్న ఫోటో

     ఈ ఫోటో ఎప్పటిదీ అనుకుంటున్నారా...? యమదొంగ చిత్రంలోనిది. అదేంటీ జూనియర్‌ ఎన్టీఆర్‌ కదా హీరో అనుకుంటారా.. అవునండి. అయితే ఈ చిత్రాన్ని విశ్వామిత్ర క్రియేషన్స్‌ పతాకంపై నిర్మించగా... అందులోని లోగోలో ప్రభాస్‌ విశ్వామిత్రుని గెటప్‌లో కనిపించారు. ఆ చిత్ర దర్శకుడు రాజమౌళితో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన కూడా సై అనడంతో విశ్వామిత్రుని వేషం వేశారు ప్రభాస్‌. ఇది చాలా మందికి తెలియదనుకోండి. కావాలంటే ఒకసారి ఆ సినిమా టైటిల్‌ను పరిశీలనగా చూడండి... తెలుస్తోంది. ఇప్పుడు ఆ ఫోటోనే నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

                                          చూసేయండి ఆ వీడియోను