Oct 27,2021 22:33

ఇళ్లుకాలిపోతున్న దృశ్యం

పొర్లుకట్ట ప్రాంతంలో అగ్నిప్రమాదం
ప్రజాశక్తి -నెల్లూరు నగరంలోని పొర్లుకట్ట ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నిరుపేదల ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. బుధవారం మధ్యాహ్నం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రమాదంలో గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో నిరుపేదల ఇళ్లలోని వస్తువులన్నీ బూడిద య్యాయయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఫైర్‌ ఇంజన్‌ ల తో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరుపేదలు సంవత్సరాల తరబడి సంపాదించు కొని దాచుకున్న ఆస్తుల మొత్తం ఈ ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. ప్రభుత్వ అధికారులు అధికార పార్టీ నేతలు స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాధితులను ఆదుకోవాలి : సిపిఎం
నగరంలోని పొర్లుకట్ట ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు పి చంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక పొర్లుకట్ట వద్ద మూడు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధి తులకు సిపిఎం 47, 48వ డివిజన్‌ శాఖ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, చీరలు, ఒక్కో కుటుంబా నికి రు.2వేల చొప్పున నగదు అందజేశారు. ఆయన మాట్లాడుతూ బాధితులకు తమవంతు సహాయం చేశామని నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నారు. పార్టీ నగర కమిటీ సభ్యులు ఎ శ్రీనివాసులు, శాఖ సర్వేలు నన్నం రాజా, పి శ్రీధర్‌, జి సురేష్‌, కె బాబు, ఎ వెంకటేశ్వర్లు, ఎ ప్రసాద్‌, బి కొండయ్య, పి చిన్నసుబ్బరాయుడు, డీవైఎఫ్‌ఐ నాయకులు పి సుబ్బరాయుడు, తాయీబ్‌ పాల్గొన్నారు.