Mar 02,2021 23:14

మాట్లాడుతున్న హరికృష్ణ ప్రసాద్‌

- జిల్లా సూపరింటెండెంట్‌ హరికృష్ణ ప్రసాద్‌
ప్రజాశక్తి - మంత్రాలయం:
 ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలకు ధీటుగా పోస్టాఫీసులు కూడా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తాయని పోస్టల్‌ శాఖ జిల్లా సూపరింటెండెంట్‌ కె.హరికృష్ణ ప్రసాద్‌ తెలిపారు. మంగళవారం పంచాయతీ కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందికి పోస్టల్‌ సేవలపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో పోస్టల్‌ శాఖలో ఖాతాను ఏర్పాటు చేసుకుని మహిళలకు రూ.100 నుంచి డిపాజిట్లు చేసుకోవచ్చని తెలిపారు. పురుషులు అయితే రూ.500 నుంచి జమ చేసుకోవచ్చని చెప్పారు. ఆన్‌లైన్‌ కావడం వల్ల సేవలు వేగవంతం అవుతాయని తెలిపారు. సుకన్య సమృద్ధి యోజన పథకం కింద చిన్నారుల పేరుతో డిపాజిట్లు చేసిన వారికి జీవిత బీమా కూడా ఉంటుందని చెప్పారు. దానిని సెక్షన్‌ 80సి కింద ఇన్‌కం ట్యాక్సీ ద్వారా మినహాయింపు పొందవచ్చని తెలిపారు. ఇక పోస్టల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, కిసాన్‌ వికాస పత్రం, పెద్దల పొదుపు పథకాలతో ఇతర పథకాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కూడా బాగా ఉంటాయని తెలిపారు. అంతా ఆన్‌లైన్‌ కావడం వల్ల సులువుగా పోస్టల్‌కు సంబంధించిన ఇండియన్‌ పోస్టల్‌ యాప్‌లను ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు. డిపాజిట్ల చెల్లింపులు చేసుకోవచ్చని, బ్యాంకింగ్‌ రంగంతో సమానంగా పోస్టల్‌ నుంచి సేవలు అందిస్తున్నామని తెలిపారు. పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫిజల్‌ రహమాన్‌ పాల్గొన్నారు.