
ఫొటో రైటప్: మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు
పోర్టు కార్మికుల సమస్యలపై
దశలవారి పోరాటం
ప్రజాశక్తి -ముత్తుకూరు :కష్ణపట్నం పోర్టు కార్మికుల సమస్యలపై దశలవారీగా పోరాటాన్ని ఉధతం చేస్తామని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నర్సింగరావు తెలిపారు. సోమవారం స్థానిక శ్రామిక భవన్లో కష్ణపట్నం పోర్టు కార్మికులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్ణపట్నం పోర్టు యాజమాన్యం కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, జిల్లా స్థాయి అధికారులు సైతం ఆదేశాలు జారీ చేసినా నేటికీ వారికి ఇవ్వకపోవడం విచారకరమన్నారు. నవంబర్ 30వ తేదీలోగా వారి సమస్యలు పరిష్కరించాలని జిల్లా యంత్రాంగం కోర్టు యాజమాన్యానికి తెలిపినా వారు పట్టించుకోవడంలేదన్నారు. భారీ వర్షాలు కారణంగా అధికారులు బిజీగా ఉన్నందున తాము 30వ తేదీన తలపెట్టిన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నామని తెలిపారు. డిసెంబర్ 1నుంచి10వ తేదీ వరకు దశలవారీగా ఆందోళన ఉధతం చేస్తామని తెలిపారు. అప్పటికి పూర్తిగా దిగిరాకపోతే జిల్లా కేంద్రంలో డిసెంబర్ 10వ తేదీన మహా గర్జన కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. పోర్టు కార్మికుల సమస్యలపై పోరాటం చేసేందుకు జిల్లాలోని వివిధ కార్మిక యూనియన్ల సహకారం తీసుకుంటామన్నారు.కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కటారి అజరు కుమార్, ఇండిస్టియల్ కారిడార్ కార్యదర్శి ఎం.మోహన్ రావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు టివివి ప్రసాద్, పోర్టు యూనియన్ కార్యదర్శి గోగుల శ్రీనివాసులు, అధ్యక్షులు గడ్డం అంకయ్య, భవన నిర్మాణ జిల్లా కార్యదర్శి కొండా ప్రసాద్, ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి కోలగట్ల సురేష్, సిఐటియు జిలాప్ల ఉపాధ్యక్షురాలు రెహానాబేగం, సిఐటియు జిల్లా కోశాధికారి అన్నపూర్ణమ్మ, మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా నాయకులు అల్లాడి గోపాల్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గోనె దయాకర్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పెంచల నర్సయ్య పాల్గొన్నారు.