
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మెయిన్ డ్రాకు జరుగుతున్న అర్హత పోటీలో అంకిత రైనా కూడా పరాజయాన్ని చవిచూసింది. పురుషుల విభాగంలో రామ్‌కుమార్, గుణేశ్వరన్ ఇప్పటికే ఓటమిపాలవ్వగా.. తాజాగా క్వార్టర్స్‌కు చేరి ఆశలు రేపిన అంకిత రైనా పరాజయాన్ని చవిచూసింది. బుధవారం జరిగిన క్వార్టర్స్ పోటీలో రైనా 2-6, 6-3, 1-6 సెట్ల తేడాతో డానిలోవిక్(సెర్బియా) చేతిలో ఓటమిపాలైంది. తొలిసెట్‌ను ఓడిన అంకిత.. రెండోసెట్లో పుంజుకొని ఆ సెట్‌ను కైవసం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడోసెట్ల అలసిపోయిన అంకిత ఆ సెట్‌ను 1-6తో చేజార్చుకొని మ్యాచ్‌ను కోల్పోయింది. దీంతో కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాలనుకున్న అంకిత ఆశలు అడియాశలయ్యాయి.