Feb 25,2021 22:02

ఫొటో : అధికారులతో మాట్లాడుతున్న ఎంపిడిఒ నరసింహారావు

ఫొటో : అధికారులతో మాట్లాడుతున్న ఎంపిడిఒ నరసింహారావు
పోలింగ్‌ కేంద్రాల్లో పరిశీలన
ప్రజాశక్తి-బుచ్చిరెడ్డిపాలెం : ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల ముందస్తు ఏర్పాట్లలో భాగంగా మండలంలోని రేబాల గ్రామంలో పోలింగ్‌ కేంద్రాలను ఎంపిడిఒ నర్సింహారావు పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాలలోని మౌలిక వసతులను పరిశీలించి ఓటర్ల వివరాలను స్థానిక సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా అన్ని పోలింగ్‌ కేంద్రాలను
పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆ మేరకు ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఇఒపిఆర్‌ పెంచల శ్యామ్‌, పంచాయతీ కార్యదర్శులు సురేష్‌, శ్యామ్‌ సుందర్‌, తదితరులున్నారు.