
ప్రజాశక్తి-కొండపి: మండలంలోని కె.ఉప్పలపాడు, మిట్టపాలెం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సిసిఎస్ డిఎస్పి ప్రసాద్‌కుమార్ బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన గ్రామస్తులతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలని అన్నారు. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట శింగరాయకొండ సిఐ శ్రీనివాసులు, ఎస్ఐ ఎన్‌సి ప్రసాద్, పోలీసు సిబ్బంది ఉన్నారు.