Nov 30,2020 22:02

పోల్‌ టాక్స్‌ రద్దు చేయాలని వినతి
ప్రజాశక్తి- తిరుపతి సిటి:
విద్యుత్‌ పోల్‌ టాక్స్‌ విధానాన్ని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కేబుల్‌ ఆపరేటర్‌ అసోసియేషన్‌ జేఏసీ నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తాను కోరారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఏపీ ఫైబర్‌ సిగల్స్‌ కొత్తవారికి ఇవ్వకుండా గత 30 సంవత్సరాలుగా ఉంటున్న అపరేటర్స్‌కే ఇవ్వాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వర్క్‌ ఫ్రం హోమ్‌, విద్యార్థుల ఆన్లైన్‌ క్లాసులకు ఇంటర్‌నెట్‌ చాలా అవసరమని, తక్షణమే అపరేటర్లకు ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్‌ సంస్థవారు సెటప్‌ బాక్స్‌లు ఓటిలు అందచేయాలి కోరారు. కరోనా భారినపడి కేబుల్‌ ఆపరేటర్లు చనిపోవడం జరిగిందని, కనుక ప్రతి ఇంటికి సర్వీస్‌ అందించే కేబుల్‌ ఆపరేటర్స్‌ని అసంఘటిత కార్మికులుగా గురించి భీమా వర్తింపచేయాలని కోరారు. కార్యక్రమంలో మధుబాబు, సింగర్‌ వేలు తదితరులు పాల్గొన్నారు.