Mar 02,2021 23:00

ప్రజాశక్తి-వలేటివారిపాలెం : పొగాకులో అన్యపదార్ధాలు లేకుండా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పొగాకు బోర్డు ప్రాంతీయ అధికారి డి వేణుగోపాల్‌ సూచించారు. గడ్డి పరకలు, ప్లాస్టిక్‌ సంచులు, ప్లాస్టిక్‌ పదార్ధాలు, పురికొస లేకుండా గ్రేడింగ్‌ చేసే సమయంలోనూ, అల్లిక సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండలంలోని బంగారక్కపాలెం గ్రామంలో ఉత్తమ యాజమాన్య పద్ధతులపై మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్‌ మాట్లాడుతూ ఈ ఏడాది మేలిమి రకం పొగాకు వచ్చినందున రైతులు పరిస్ధితిని బట్టి పొగాకు మండెలను తిరగేసుకోవాలని సూచించారు. హైగ్రేడు పొగాకులో పచ్చకాడలు లేకుండా చూసుకోవాలన్నారు. వేలం నిర్వహణాధికారి లక్ష్మణరావు మాట్లాడుతూ బంతి మొక్కలు, bర్రబుట్టలు, టార్పాలిన్‌ పట్టలు సబ్సిడీతో అందజేస్తున్నట్లు తెలిపారు. సిటిఆర్‌ఐ శాస్త్రవేత్త రమేష్‌ మాట్లాడుతూ పొగాకు క్యూరింగ్‌లో బ్యారన్‌కు సరిపడా పొగాకు కర్రలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల ప్రతినిధులు పి.గౌతమ్‌, రవి, వెంకటేశ్వర్లు, నాగేంద్ర, జి. మహేంద్ర, రైతులు పాల్గొన్నారు.
గ్రేడింగ్‌పై రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు