Oct 28,2021 15:39

ప్రజాశక్తి-పొదిలి
రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వ్యక్తిని రక్షించొచ్చని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం అలవర్చుకోవాలని దర్శి డిఎస్పి నారాయణస్వామి రెడ్డి పేర్కొన్నారు. పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్బంగా పొదిలి సర్కిల్‌ పరిధిలో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం పలువురు పోలీసులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో పొదిలి సర్కిల్‌ ఇనిస్పెక్టర్‌, సుధాకర్‌, ఎస్‌ఐ లు, పాల్గొన్నారు.