Nov 29,2021 13:53

పొదిలి (ప్రకాశం) : పొదిలి సిపిఎం ప్రాంతీయ నాలుగో మహాసభ బాలకఅష్ణ నగర్‌ లో ఏ.శ్రీనివాసరావు అధ్యక్షతన సోమవారం ప్రారంభమయింది. ముందుగా సిపిఎం జెండాను సీనియర్‌ రిటైర్డ్‌ ఆర్టీసీ ఉద్యోగి పి.ఛార్లెస్‌ ఆవిష్కరించారు. అనంతరం సిపిఎం దక్షిణ భారతదేశం వ్యవస్థాపక నాయకులు సుందరయ్య, సిపిఎం సంతనూతలపాడు మాజీ శాసనసభ్యులు తవనం చెంచయ్య, బాలకృష్ణ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అమర వీరులకు నివాళులు అర్పిస్తూ సభ ప్రారంభమయింది.