ప్రజాశక్తి - ఆత్మకూరు: మున్సిపాలిటీలలో, పట్టణాలలో పన్నులు పెంచుతూ జారీ చేసిన జీవోలను రద్దు చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి ఏసురత్నం, నాయకులు రణధీర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని వైసిపి కార్యాలయంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజాద్ అలీకి సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలలో పెంచే ఆస్తి, మంచినీటి, డ్రైనేజీ పన్నులను రద్దు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్, పట్టణాలలో నివసించే 1.6 కోట్ల మంది ప్రజలపై భారం మోపేందుకు తీసుకొచ్చిన జీవోలు 196, 197ను రద్దు చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలపై భారం పడకుండా జీవోలను రద్దు చేస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు రామ్ నాయక్, సురేంద్ర, మోహన్, భరత్, మహమ్మద్, పాల్గొన్నారు.
వైసిపి కార్యాలయంలో వినతిపత్రం ఇస్తున్న సిపిఎం నాయకులు