Oct 27,2021 21:53

ఫొటో : నిరసన చేస్తున్న రైతు సంఘం నాయకులు

ఫొటో : నిరసన చేస్తున్న రైతు సంఘం నాయకులు
పంటను కొనుగోలు చేయాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : మెట్ట రైతులు పండించిన పంటలను ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలలో కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని ఏపి జిల్లా రైతు సంఘం నాయకులు కాకు.వెంకటయ్య డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక వ్యవసాయ ఏడిఏ కార్యాలయం ఎదుట రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలకు అనుమతి ఇచ్చి సజ్జ పంటను కొనుగోలు చేయాలని ధర్నా చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలో పాలకులతో పాటు అధికారులు కూడా విఫలం అయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు పంట జీవనాధారంగా పండించిన మెట్ట రైతుల పంటను కొనుగోలు చేయించక యార్డు కు అనుమతులు ఇవ్వక పోవడంలో అధికారులు పూర్తిస్థాయిలో విఫలమయ్యారని ధ్వజ మెత్తారు.
రైతుల కోసమే ప్రభుత్వం అధికారులు లక్షలు వెచ్చించి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుచేసిన పరిమితం తో రైతులు ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తూ దళారులకు ప్రభుత్వమే అప్ప చెప్పి దోచుకో మంటుందని ఇందుకు నిదర్శనం ఉదయగిరి మెట్ట ప్రాంత రైతులు ఆవేదనేనని గుర్తు చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రైతులు పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసి రబీలో రైతు వేసిన పంటల కొనుగోలుకు మార్క్‌ ఫడ్‌ అధికారులకు వెంటనే అనుమతులు ఇచ్చి రైతు ఆత్మహత్యలకు పాల్పడకుండా రైతు పక్షాన నిలవాలన్నారు. ఈ కార్యక్రమం లో రైతు సంఘం నాయకులు కోడే రమణయ్య, భాష మొహిద్దిన్‌, ఖాజావలి, జనార్ధన్‌ వెంకటేశ్వర్లు మండల రైతులు పాల్గొన్నారు.