Nov 30,2020 22:00

తహశీల్దారుకు వినతి పత్రం ఇస్తున్న రైతు, కౌలు రైతు సంఘం నాయకులు

ఉంగుటూరు : నివర్‌ తుపాన్‌తో పంటలు నష్టపోయిన సన్న, చిన్నకారు, కౌలు రైతులకే పంట బీమా, ప్రభుత్వం అందించే రాయితీలు వర్తింపజేయాలని కౌలు రైతుల సంఘం తూర్పు కృష్ణా జిల్లా అధ్యక్షులు టివి లక్ష్మణస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్థానిక తహశీల్దారు కార్యాలయం ముందు సోమవారం రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసర తెలిపి తహశీల్దారు ఆర్‌.దుర్గాప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మినుము రైతులకు ప్రభుత్వం ఉచితంగా అపరాల విత్తనాలు ఇవ్వాలని, పూర్తిగా దెబ్బతిన్న పంటలకు రూ.30 వేలు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శి శనగల లక్ష్మారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి అజ్మీర వెంకటేశ్వరరావు, సంఘ నాయకులు గాలబ్‌, ఆరుమళ్ల వీరారెడ్డి, వజ్రాల సత్యనారాయణ పాల్గొన్నారు.