Nov 22,2020 21:13

అమరావతి బ్యూరో: రాష్ట్రంలో వెయింటింగ్‌లో ఉన్న పలువురు ఐఎఎస్‌, ఐఆర్‌ఎస్‌ బాధ్యతలు అప్పగిస్తూ, ఆయా స్థానాల్లో ఉన్న అధికారులను ఇతర శాఖలకు ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదివారం ఉత్తర్వులను విడుదల చేశారు. వెయిటింగ్‌లో వున్న ఎంవి శేషగిరిరావును స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ల శాఖ ఐజిగా నియమిస్తూ ఆపోస్టులో వున్న సిద్దార్థ జైన్‌ను సర్వే అండ్‌ సెటిల్‌మెంట్స్‌కు కమిషనర్‌గా నియమించింది. అలాగే వెయిటింగ్‌లో వున్న ఐఆర్‌ఎస్‌ అధికారి కె రవీణ్‌ కుమార్‌రెడ్డిని ఎపిఐఐసి ఎండిగా, ఎం రమణారెడ్డిని ఎపి టవర్స్‌ సిఇఓగా, కాన్సెప్ట్‌ సిటీస్‌ ఎఫ్‌ఎసి సిఇఓగా బాధ్యతలు అప్పగించింది. సిహెచ్‌ రాజేశ్వరరెడ్డిని ఎపి ఎడ్యుకేషన్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఎండిగా, ఎస్‌బిఆర్‌ లకుమిశెట్టిని ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌కు డైరక్టర్‌గా నియమించారు.