Feb 09,2021 01:11

నామినేషన్‌ వేస్తున్న మొస్య

మన్యంలో పంచాయతీ పోరులో భాగంగా సిపిఎం మద్దతుతో సోమవారం పలువురు సర్పంచి అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. తొలుత భారీ ర్యాలీలు నిర్వహించారు.
చింతపల్లి : మండలంలోని చౌడుపల్లి పంచాయతీ సర్పంచి అభ్యర్థిగా సిపిఎం, ప్రజాసంఘాల మద్దతుతో పొత్తూరు కాంతమ్మ నామినేషన్‌ వేశారు. పార్టీ మండల నాయకులు సాగిన చిరంజీవి, సింహాచలం, సిపిఐ నాయకులు పుత్తూరు చిన్నా, మాజీ ఎంపిటిసి కుజ్జన్న తదితరులు పాల్గొన్నారు.
చింతపల్లి మేజర్‌ పంచాయతీకి ఒకటో వార్డు సభ్యురాలిగా సిపిఎం, ప్రజాసంఘాల మద్దతుతో బోనంగి పుష్పవతి నామినేషన్‌ వేశారు. పార్టీ మండల నాయకులు సాగిన చిరంజీవి, కిల్లో సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని పర్యాటక ప్రాంతమైన లంబసింగి పంచాయతీకి సర్పంచి అభ్యర్థిగా సిపిఎం, ప్రజా సంఘాలు బలపరిచిన బోనంగి పార్వతమ్మ నామినేషన్‌ వేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్‌, మండల కార్యదర్శి పాంగి ధనుంజరు తదితరులు పాల్గొన్నారు.
ముంచంగిపుట్టు మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ సర్పంచి అభ్యర్థిగా కొర్రా త్రినాధ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. తొలుత సిపిఎం నేతలు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. బరడ గ్రామ సచివాలయంలోని నామినేషన్‌ కేంద్రానికి వెళ్లి నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు అవకాశం ఇస్తే గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పంచాయతీ పరిధిలోని తాగునీరు, విద్యుత్‌, పారిశుధ్య సమస్యలను పరిష్కరిస్తానన్నారు.
అనంతగిరి : మండలంలో సిపిఎం బలపరిచిన ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరిలో పోకూరు పంచాయితీకి కిల్లో మొస్య, అనంతగిరికి సోమేల రూతు. రొంపల్లికి నేగల గంగులు, భీంపొల్‌కి జేష్ఠ ఈశ్వరమ్మ, లుంగపర్తికి జన్ని సుబ్బారావు సర్పంచి స్థానాలకు నామినేషన్‌ వేశారు. అలాగే 23 మంది వార్డు మెంబర్‌ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి కిల్లో మొస్య మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న సిపిఎం బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ముంచంగిపుట్టు: సిపిఎం మద్దతుతో పలు పంచాయతీల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కించాయిపుట్‌ పంచాయతీ సర్పంచి స్థానానికి మఠం ముక్కి శ్రీను, లక్ష్మీపురం పంచాయతీ నుంచి కొర్రా త్రినాథ్‌, కరిముఖిఫుట్‌ పంచాయతీ నుంచి గల్లెల పారమ్మ, వనుగుమ్మ పంచాయతీ నుంచి సొండ ప్రమీల, జర్రెల పంచాయతీ నుంచి వంతాల. లలిత, ఏనుగురాయి పంచాయతీ నుంచి పేటియా రాందాస్‌ నామినేషన్లు వేశారు.