
రాష్ట్రంలో పల్లెపోరు రెండోదశకు చేరుకుంది. గ్రామాల్లో ఓటర్ల సందడి నెలకొంది. నిన్నటివరకూ ఎక్కడెక్కడో తమ పనుల నిమిత్తం ఉన్న గ్రామస్తులంతా ఎన్నికల కారణంగా తమ సొంత గ్రామాలకు చేరుకున్నారు. ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకోవైపు శరీరం సహకరించకపోయినా, వయసు మీద మళ్లినా లెక్కచేయకుండా వికలాంగులు, వృద్ధులు తమ ఓటు హక్కును కుంటుంబీకులు, పోలీసులు సహాయంతో వినియోగించుకుంటున్నారు. నేటితరం యువతకు ఓటుహక్కు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు.


విజయనగరం జిల్లా పాచిపెంటలో..

విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం గవరన్నపేట గ్రామంలో ఓటు వేస్తున్న కొత్త పెళ్లికూతురు