May 03,2021 19:53

'ప్లాస్మా దానం చేయండి. దీని వల్ల కరోనా నుంచి మరికొందరు త్వరగా కోలుకోవడానికి సహాయపడినవారవుతారు' అని కోరారు చిరంజీవి. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా పిలుపునిచ్చారు. 'కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో బాధితులు ఎక్కువవుతున్నారు. ముఖ్యంగా ప్లాస్మా కొరత వల్ల చాలా మంది ప్రాణాల కోసం పోరాడుతున్నారు. వారిని ఆదుకునేందుకు మీరు ముందుకు రావాల్సిన సమయమిది. మీరు కరోనా నుంచి కోలుకున్నట్లయితే మీ ప్లాస్మాని దానం చేయండి. దీని వల్ల మరో నలుగురు కరోనా నుంచి వేగంగా కోలుకోవడానికి సహాయపడినవారవుతారు. ప్రత్యేకంగా నా అభిమానులూ ఈ కార్యక్రమంలో పాల్గనవల్సిందిగా కోరుతున్నాను' అని పేర్కొన్నారు. ప్లాస్మా దానంపై సూచనలు, వివరాల కోసం చిరంజీవి ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ కార్యాలయాన్ని (040-23554849, 94400 55777) సంప్రదించవచ్చన్నారు. వెంకటేశ్‌, నాగార్జున సైతం అభిమానులు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.