Jan 14,2021 10:36

శ్రీకాకుళం (కోటబొమ్మలి) : చిన్నపాటి గొడవను సర్దిచెప్పడానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన చిన్న హరిశ్చంద్రపురంలో భోగి నాడు రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కోట నాగేశ్వరరావు(40) ఇంటి పక్కన ఉన్నవారు గొడవ పడుతుంటే వారికి సర్ది చెప్పి గొడవను సద్దుమణిగించేందుకు వెళ్లాడు. అయితే ఆ గొడ‌వ‌లో రాళ్లు రువ్వుకోవ‌డంతో ఓ రాయి అత‌ని త‌ల‌కు బ‌లంగా త‌గిలి మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు.