Jan 14,2021 13:18

పిఠాపురం (తూర్పు గోదావరి) : నేడు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని.. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో కోడిపందేలు జోరందుకున్నాయి. లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ రెండో రోజు గురువారం కూడా కోడి పందేలను, గుండాట శిబిరాలను యథేచ్ఛగా నిర్వహించారు. ఆయా శిబిరాల వద్ద ప్రజలు గుమికూడారు. భోగి పండుగ నాడు జనాలు అంతగా లేనప్పటికీ ఈ రోజు మాత్రం జనాలు ఎక్కువగా శిబిరాల వద్దకు చేరుకున్నారు. కోడిపందేలపై అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.