Sep 15,2021 19:24

ఇషాన్‌ ఖట్టర్‌ తొలి సినిమా 'ధడక్‌'. ఇప్పుడు తన రెండవ చిత్రం వార్‌ డ్రామాగా చేస్తున్నాడు. 'పిప్పా' పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని ఇషాన్‌ సోషల్‌ మీడియాలో విడుదల చేశాడు. ఇండో-పాకిస్తాన్‌ మధ్య వార్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్‌ బుధవారం ప్రారంభమైంది. ఇదే విషయాన్ని ప్రకటిస్తూ సినిమాలో తన ఫస్ట్‌ లుక్‌ షేర్‌ చేశాడు. ఈ పోస్టర్‌లో యుద్ధ ట్యాంక్‌ పై నుంచుని భీకరమైన రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు ఇషాన్‌. 45వ అశ్వికదళ ట్యాంక్‌ స్క్వాడ్రన్‌కి చెందిన బ్రిగేడియర్‌ మెహతా కథ ఆధారంగా ఈ 'పిప్పా' సినిమా తెరకెక్కుతోంది.