Jun 11,2021 11:04

ప్రజాశక్తి- నందిగామ (కృష్ణా) : బిజెపి కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్‌ చార్జీలను తగ్గించాలంటూ.. నందిగామ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంక్‌ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పిసిసి సభ్యులు తలమాల డేవిడ్‌ రాజు, నందిగామ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కామ శ్రీనివాసరావు మాట్లాడుతూ... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్‌ చార్జీలను పెంచుతూ ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నాయని అన్నారు. తక్షణమే వాటి ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఇంధన ధరలు పెరగడం వల్ల పరోక్షంగా నిత్యావసర ధరలు పెరిగి, పేద మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం పడుతుందన్నారు. డీజిల్‌ ధరలు పెరగడం వల్ల రైతులకు కూడా ధరలు పెరిగే అవకాశం ఉందని, వ్యవసాయంపై పరోక్షంగా భారం పడుతుందని చెప్పారు. కరోనా కష్టకాలంలో ధరలను పెంచటం సమంజసం కాదన్నారు. కోవిడ్‌ టీకాలను ఇతర దేశాలకు అమ్ముకోవడం వల్లనే కరోనాతో ప్రజలు చనిపోయారని, కరోనా బాధితుల మఅతికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే కారణం అని ఆరోపించారు. పెరిగిన పెట్రోలు, డీజిల్‌ చార్జీలకు నిరసనగా, కరోనా మఅతులకు బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గోపు నరేంద్ర, పెసరమల్లి శ్యామ్‌, పలువురు నాయకులు పాల్గొన్నారు.