Oct 28,2021 17:19

పెంచిన పెట్రోల్‌ డీజిల్‌ ధరలు తగ్గించాలని వామపక్ష పార్టీలు ధర్నా చేస్తున్న దశ్యం

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్‌ : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధేరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వందవాసి నాగరాజు తెలిపారు. గురువారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ కలసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వందవాసి నాగరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ మీద పన్నుల రూపంలో లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ అదాని, అంబానీలకు కట్టబెడుతున్నారని వాపోయారు. ప్రభుత్వ రంగ సంస్థలను వారికి దారాదత్తం చేసి దేశాన్ని సర్వనాశనం చేస్తోందని తెలిపారు. రైతులు పోరాడుతుంటే వారి సమస్యలు పరిష్కరించకపోగా వారిని చంపడానికి ప్రయత్నం చేయడం సిగ్గుచేటు అన్నారు. మన రాష్ట్రంలో విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు వారికి దారాదత్తం చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. సిపిఎం కార్యదర్శి ఆర్‌ వెంకటేష్‌, సిపిఐ కార్యదర్శి మహేష్‌ , నాయకులు, విజరు శివ, రమేష్‌, సతీష్‌, సురేష్‌, సిపిఐ నాయకులు చిరంజీవి, రవి, గోపి, తదితరులు పాల్గొన్నారు.