Oct 28,2021 15:13

ప్రజాశక్తి -ఏలేశ్వరం:
దేశంలో పెంచిన పెట్రోల్‌ డీజిల్‌ ధరలు వెంటనే తగ్గించాలని కోరుతూ ఏలేశ్వరం లారీ ఓనర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు సోలాపు కన్నబాబు, వైభోగం సుబ్బారావులు మాట్లాడుతూ పెరిగిన డీజిల్‌ ధరల వల్ల లారీలు తిప్పడం కష్టతరంగా మారిపోయిందన్నారు. సింగిల్‌ లారీ ఓనర్లు, ఓనర్‌ కమ్‌ డ్రైవర్లు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారపావేదన వ్యక్తం చేశరు. పెట్రోల్‌ ,డీజిల్‌ పై వసూలు చేస్తున్న రోడ్డు సెస్‌ రద్దు చేయాలని, టోల్‌ రుసుము నియంత్రించాలి, థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున లారీ ఓనర్లు, వర్కర్లు పాల్గొన్నారు.