Mar 02,2021 21:35

నిరసన తెలుపుతున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి - రైల్వేకోడూరు: పెట్రో ధరలను తక్షణం తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో టోల్‌గేట్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గినా, దేశంలో మాత్రం డీజిల్‌ పెట్రోలు గ్యాస్‌ ధరలు, పెంచేసిందన్నారు. ప్రతిరోజు ధరలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ రూ.100 చేశారని, గ్యాస్‌ ధరలు రూ.900 చేరిందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ కార్పొరేట్ల కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. ధరలను అదుపు చేయకపోతే ప్రభుత్వం పతనం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు ఉపాధ్యక్షుల లింగాల యానాదయ్య, డివైఎఫ్‌ఐ మండల కన్వీనర్‌ హరినారాయణ, అవాజ్‌ మండల కన్వీనర్‌ మౌలాలిబాష, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు జయరామయ్య, సామాజిక కార్యకర్త మందపాటి శంకరయ్య, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు నాగరాజు, రవి, మల్లికార్జున, సాయి, మధు పాల్గొన్నారు.