Oct 27,2021 18:52

ప్రజాశక్తి - పాలకొల్లు
         పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన మండలంలోని లంకలకోడేరులో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నానుద్దేశించి మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రజలు కరోనాతో పనుల్లేక ఇబ్బంది పడుతుంటే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడంతో రవాణా ఛార్జీలు పెరిగి ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందన్నారు. పెట్రోల్‌ను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేగి రత్తయ్య, గోగులమండ భాగ్యానందం, కత్తుల శ్రీను, అంగర సత్యనారాయణ, ఆంజనేయులు పాల్గొన్నారు.