Nov 24,2021 20:56

న్యూఢిల్లీ :  పార్లే బిస్కెట్లు మరింత ప్రియం కానున్నాయి.    బిస్కెట్ల ధరలను 5 నుంచి 10 శాతం పెంచుతున్నట్లు  పార్లే ప్రొడక్ట్స్‌ కంపెనీ ప్రకటించింది. చక్కెర, గోధుమ పిండి, వంటనూనెల ధరలు భారీగా పెరిగినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.  రస్క్‌లు, కేకుల ధరలనూ 7 నుంచి 8 శాతం వరకు పెంచింది.