Oct 28,2021 11:56

ప్రజాశక్తి - కర్నూలు : పెంచిన పెట్రోల్‌ డీజిల్‌ వంటగ్యాస్‌ ధరలు తగ్గించాలని ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం వైఖరి నశించాలి అని సిపిఎం జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం సిపిఎం ఆధ్వర్యంలో నగరంలోని సుందరయ్య జంక్షన్‌ నుండి కొత్త బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అలాగే ఓల్డ్‌ సిటీ ఆధ్వర్యంలో సిపిఎం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద మోటర్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బళ్లారి చౌరస్తా నందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఎ గఫూర్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు పుల్లారెడ్డి, తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో న్యూ సిటీ కార్యదర్శి రాముడు, ఓల్డ్‌ సిటీ కార్యదర్శి రాజశేఖర్‌, నగర కమిటీ నాయకులు సాయిబాబా, నరసింహులు, గోపాల్‌, సుధాకరప్ప, లోకేష్‌, ఎంపీ ఆనంద్‌, బషీర్‌ అహ్మద్‌, శ్రీనివాసులు, నాగేశ్వరావు, మహిళలు మాజీ కార్పొరేటర్‌ అలివేలమ్మ ,కె ఎస్‌ పద్మ, నోమేశ్వరి, సిపిఎం నాయకులు ,కార్యకర్తలుపెద్ద ఎత్తున పాల్గొన్నారు.