Jun 11,2021 16:39

ప్రజాశక్తి-ఏర్పేడు

ఏర్పేడు మండలంలోని వికృతమాల లో శుక్రవారం "వైయస్సార్ - జగనన్న" కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న గృహ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇల్లు లేని పేద వాళ్ళు ఎక్కడ ఉండకూడదనే గొప్ప మనసుతో పేదవాళ్లకు సొంత ఇల్లు కల నిజం చేస్తున్న జగన్ అన్నకు ధన్యవాదాలు. దేశ చరిత్రలోనే ఎవ్వరూ చేయని విధంగా రాష్ట్రంలో ఒకేసారి 30.76 లక్షల మంది పేద అక్కచెల్లెమ్మల పేరుతో ఇల్లు పట్టాలు పంపిణీ చేసి రికార్డు సృష్టించారు జగనన్న. అన్ని వసతులతో ఇల్లు మాత్రమే కాకుండా త్రాగు నీరు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థ, ఇంటర్నెట్ వంటి అధునాతన మౌలిక సదుపాయాలతో వైయస్సార్ - జగనన్న కాలనీ నిర్మిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా సెంటు భూమి లేని నిరుపేదల కుటుంబాల్లో వైఎస్ఆర్-జగనన్న కాలనీల ద్వారా వెలుగులు నింపిన జగనన్న. పేద అక్కచెల్లెలు అందరికీ ఒక అన్న లాగా ఇంటి స్థలాన్ని మీ పేరు మీదే ఇస్తున్న జగనన్న మనందరికీ దేవుడుతో సమానం. ఇంకనూ సొంతింటికి దరఖాస్తు చేసుకుని రాకున్నా ఉన్నవాళ్లు నాకు తెలియజేయండి మీకు పక్కా ఇల్లు వచ్చేలా నేను చూస్తాను. 2014 ఎన్నికల్లో నేను ఓడిపోయినప్పుడు కూడ ఏర్పేడు మండలం నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చారు. నేడు వికృతమాల లేఅవుట్లో 726 ఇల్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది.కరోనా సమయంలో కూడా పేద ప్రజలకు మూడుపూటలా అన్నం తినడం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగనన్నకు మీ అందరి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. కరోనా వల్ల మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న వెంటనే నాకు నేరుగా ఫోన్ ద్వారా తెలియజేయండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి కిషోర్ రెడ్డి, జెడ్ పిటిసి డాక్టర్ కావేరీ తిరుమలయ్య, ఎంపీడీవో విష్ణు చిరంజీవి, ఎంపీటీసీలు, సర్పంచులు, వైసీపీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.