Nov 28,2020 01:18

మాట్లాడుతున్న మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌

హుకుంపేట : రాష్ట్రంలోని పేదలకు జగన్‌ ప్రభుత్వం చేసిందేమీ లేదని, ప్రచారార్భాటానికే జగనన్న తోడు కార్యక్రమం పెట్టారని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌ విమర్శించారు. మండల కేంద్రంలో ఆయన శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వ మోసాలను ప్రజలు మెల్లగా అర్థం చేసుకుంటు న్నారన్నారు. కేంద్రం ఇస్తున్న రూ.10 వేలను రాష్ట్రమే చిరువ్యాపారులకు చెల్లిస్తున్నట్లు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. నాయకులు కొర్రా తులసీరావు, శెట్టి లక్ష్మణుడు, సాగరి సుబ్బారావు, బాకూరు వెంకటరమణ, పల్టాసింగి కామేశ్వరరావు, కంబిడి జ్ఞాన ప్రకాష్‌, శశి భూషణ్‌ పాల్గొన్నారు.