Nov 30,2020 00:39

శిక్షణ కేంద్రం ప్రారంభంలో మాట్లాడుతున్న ఆసరా ప్రతినిధులు

గాజువాక : ఆసరా చారిటబుల్‌ సొసైటీ ఆధ్వర్యాన పెదగంట్యాడ సిడబ్ల్యూసి సెంటర్‌లో ఏర్పాటుచేసిన కుట్టు శిక్షణా కేంద్రాన్ని సిడబ్ల్యూసి మెంబర్‌ జెసి.చంద్రమౌళి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అతివలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కుట్టు శిక్షణా కేంద్రం దోహదపడుతుందన్నారు. ఆసరా సెక్రటరీ రాజేశ్వరి మాట్లాడుతూ, ఆసరా చారిటబుల్‌ సొసైటీ ఆధ్వర్యాన ఇప్పటి వరకు ఆరు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కేంద్రానికి ఆర్‌వి.సూర్యనారాయణ, ఐవి.రవిశంకర్‌, సిహెచ్‌.సుష్మిత, ఎఎస్‌.నంబూరి, కె.సాయినాథ్‌, ఎం.రామారావు ఆర్థిక సహకారం అందించారు. స్థానిక సిఐటియు నాయకులు సిహెచ్‌.రాముడు, సిడబ్ల్యుసి సెంటర్‌ కార్యదర్శి పాల శ్రీనివాస రెడ్డి, ట్రెజరర్‌ ఎర్రా అప్పారావు, పాల అప్పలరెడ్డి, విసిసి జోన్‌ కన్వీనర్‌ కె.సుశీల, హారిక, దేవిక, నిహారిక, రేణుక పాల్గొన్నారు.