Nov 25,2021 20:12

బల్లిలాంటి రూపం... 10 అడుగుల మెడ... నాలుగు కాళ్లతో నడచే ఈ వింత జీవి వందల ఏళ్ల క్రితం అంటే.. డైనోసార్లు తిరిగినప్పుడు భూమిపై తిరగాడుతుండేది. దీని శరీరం పొడవు 20 అడుగులు ఉంటుంది. అందులో మెడే 10 అడుగులు ఉండేది. ఆ మెడను ఎలాగంటే అలా మెలికలు తిప్పడం కూడా దీని ప్రత్యేకత. చూడ్డానికి డైనోసార్‌ పోలికలున్నా కానీ ఇది డైనో కాదు. సరీసృపం. నేల మీద, సముద్రంలో జీవిస్తుంది. ఇప్పుడు ఉన్న బల్లులకు ముత్తాతలాంటిదేనట. ఇవి ఎక్కువగా ఐరోపా ప్రాంతంలో జీవించేవి. ఈ మధ్యకాలంలో తవ్వకాల్లో వీటి శిలాజాలు దొరికాయి. కానీ దీని మెడ ఇంతలా పొడవు ఎందుకు ఉండేదని ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, నీటి లోపలికి తలపెట్టి చేపలు తినడం వల్ల క్రమేణా ఇలాంటి మెడ ఏర్పడిందని భావిస్తున్నారు.

ఈ పొడవు మెడ జీవి చాలా బద్ధకస్తురాలు. నేలపైన చాలా నెమ్మదిగా నడవడమే కాదు, నీళ్లలో ఈత కూడా మెల్లగా ఉండేది. అప్పట్లో డైనోలు వీటిని చూస్తే వెంటబడి మరీ తినేవి. వీటికి తోకలు తెగితే మళ్లీ పుట్టుకొస్తాయి. ఇక వీటి పళ్లు చాలా పదునుదేలి ఉండేవి. వాటితో చేపల్ని చిన్న చిన్న జలచరాల్ని, నేలపైన కీటకాల్ని పట్టేసుకుంటుంది. రోజులో ఎక్కువ సేపు నీటిలోనే ఉండేవి. దీనికి నాలుగు కాళ్లు ఉండేవి. ఈ పొడవు మెడ జీవులు ఎక్కువ గుంపులుగానే తిరిగేవి.