Dec 03,2021 22:07
  • నివేదిక ఇవ్వాల్సిందే : ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు

ప్రజాశక్తి-తిరుపతి, అమరావతి బ్యూరో : పిఆర్‌సికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. పది రోజుల్లో పిఆర్‌సిని ప్రకటిస్తామని చెప్పారు. తిరుపతి ఎంఆర్‌పల్లిలోని గాయత్రి నగర్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తుండగా కొందరు ఉద్యోగులు పిఆర్‌సికి సంబంధించిన ప్లకార్డులను ప్రదర్శించారు.దీనిని గమనించిన ఆయన వారి వద్దకు వెళ్లారు. 'పిఆర్‌సి గురించి అడిగింది ఎవరు?' అని ప్రశ్నించారు. అక్కడున్న వారిలో ఒకరు తన పేరు జయచంద్ర అని, తనతో పాటు మరికొందరు ఉద్యోగులు కూడా ఉన్నారని చెప్పారు. పిఆర్‌సితో పాటు ఉద్యోగులకు సంబంధించి ఇతర సమస్యలు కూడా పరిష్కరించాలని కోరారు. దీనిపై స్పందించిన సిఎం 'జయా..! పిఆర్‌సి ప్రక్రియ పూర్తయ్యింది. వారం, పదిరోజుల్లో ప్రకటన ఉంటుంది.' అని చెప్పారు. మరోవైపు అమరావతిలోని సచివాలయంలో జరిగిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఉన్నతాధికారులు పిఆర్‌సి నివేదికను ఉద్యోగులకు ఇచ్చేందుకు నిరాకరించారు. పదిరోజుల్లో పిఆర్‌సి ఇస్తామంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన నేపధ్యంలో ఇప్పుడు నివేదిక ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నివేదిక ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశాయి. సిపిఎస్‌రద్దు, ఏయే కేడర్‌లను గెజిట్‌ కేడర్‌కుమార్చేందుకు సిఫారసు చేశారు? కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు, పెండింగ్‌ డిఎలు, గ్రామసచివాలయ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ తో పాటు పలు అంశాలకు సంబందించిన పిఆర్‌సిలో ఏమి సిఫార్సు చేశారో తెలియకుండా ఎలా చర్చిస్తామనిఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రశిుంచాయి అంతకుముందు విడివిడిగా చర్చిస్తామంటూ జాయింట్‌ కౌన్సిల్‌ అధికారులు చేసిన ప్రతిపాదనను ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాలు తిరస్కరించాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్‌భార్గవ, జిఎడి శశిభూషణ్‌, ఆర్ధికశాఖ ఇఓ కార్యదర్శి డాక్టర్‌ కెవివి సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సేవలు)పి.చంద్రశేఖర్‌రెడ్డి పాల్గనాురు. ఉద్యోగ సంఘాల తరపున ఎపి జెఎసి ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు, ఎపిజెఎసి అమరావతి ఛైర్మన్‌ బప్పరాజు వెంకటేశ్వర్లు, ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణరావు, ఎపి సెక్రటరియేట్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, యుటిఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌తో పాటు పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, జనరల్‌ సెక్రటరీలు పాల్గొన్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సిఎం చర్చించాలి: యుటిఎఫ్‌
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి నేరుగా చర్చించాలని యుటిఎఫ్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ సమావేశంలో కౌన్సిల్‌ సభ్యులను ప్రశ్నించారు. పిఆర్‌సి నివేదిక ఇవ్వకుండా అభిప్రాయాలడిగితే ఎలా చెప్పాలన్నారు.