Jul 30,2021 21:08

matladutunna tahaseeldhar

పౌర హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు
ప్రజాశక్తి-అవనిగడ్డ
రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి హక్కులు ఉన్నాయనీ, వాటికి ఎవరైనా భంగం కలిగిస్తే చర్యలు ఉంటాయని అవనిగడ్డ తహశీల్దార్‌ బి.శ్రీను నాయక్‌ హెచ్చరించారు. శుక్రవారం అవనిగడ్డ పంచాయతీ పరిధిలోని సీత లంక పార్క్‌ వద్ద పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్‌ మాట్లాడుతూ రాజ్యాంగంలో పౌరుల హక్కుల ప్రాధాన్యత గురించి ప్రజలకు వివరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి కులవివక్ష పైన అంటరానితనాన్ని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించడంతో పాటు ప్రతి నెల 30వ తేదీన పౌర హక్కుల పై ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి ఎం లక్ష్మీ కుమారి గ్రామ సర్పంచ్‌ గోరు ముచ్చు ఉమా మా ఇన్చార్జి ఏ ఎస్‌ డబ్ల్యూ గణేష్‌ బాబు మాజీ ఎంపీపీ దిడ్ల ప్రసాద్‌ అవనిగడ్డ టూ ఎస్‌ ఐ మురళి కష్ణ దేవాలయాల కార్యనిర్వహణాధికారి సీతారామయ్య గ్రామ పంచాయతీ కార్యదర్శి తోట శ్రీనివాస రావు వి ఆర్‌ ఓ గుడివాక శేషుబాబు సచివాలయం సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు