Oct 28,2021 19:41

హర్షం వ్యక్తం చేస్తున్న ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు

ప్రజాశక్తి - పి.గన్నవరం
మండల కేంద్రమైన పి.గన్నవరంలో పైర్‌స్టేషన్‌ ఏర్పాటుకు గురువారం ఎపి క్యాబినెట్‌ సమావేశం ఆమోదం తెలపడం పట్ల పి.గన్నవరం ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి కతజ్ఞతలు తెలిపారు. మండల పరిధిలో ఏ మూలన అగ్నిప్రమాదం జరిగినా 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న రాజోలు లేదా అమలాపురం లేదా కొత్తపేట నుంచి పైర్‌ ఇంజిన్‌ రావాల్సి వస్తుందన్నారు. ఇది వచ్చే లోగా సర్వం అగ్నికి ఆహుతై ఆస్తి నష్టం చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఫైర్‌స్టేషన్‌ ఏర్పాటుతో ఈ దీర్ఘ కాల సమస్యకు పరిష్కారం దొరికిందన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎంఎల్‌ఎ కు కతజ్ఞతలు తెలుపుతున్నారు.