Mar 02,2021 23:07

పెదజాలారీపేటలో పర్యటిస్తున్న జివిఎంసి కమిషనర్‌ నాగలక్ష్మి

విశాఖపట్నం : జివిఎంసి మూడవ జోన్‌ పరిధి 19వ వార్డులోని పెద్ద జాలారిపేట ప్రాంతంలో జివిఎంసి కమిషనర్‌ ఎస్‌.నాగలక్ష్మి మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. జివిఎంసి వివిధ విభాగాలు చేపడుతున్న పలు పనులను పరిశీలించారు. పెద్ద జాలారిపేటలో ప్రజలతో మాట్లాడారు. పారిశుధ్యం, తాగునీటి సరఫరా తీరుపై ప్రజలనడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లను పరిశీలించారు. బీచ్‌ ప్రాంతం పరిశుభ్రంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని శానిటరీ ఇన్‌ స్పెక్టర్లను ఆదేశించారు. సముద్రంలోకి కలుస్తున్న కాలువ నీటిని ఎస్‌టిపి వైపు మళ్ళించడానికి గల అవకాశాలపై ఇంజినీరింగు అధికారులతో మాట్లాడారు.