Jun 10,2021 21:04

సమ్మె నోటీసు అందజేస్తున్న పారిశుధ్య కార్మికులు

ఆమదాలవలస : దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఈ నెల 14, 15 తేదీల్లో మున్సిపాలిటీలో సమ్మె చేపడుతున్నామని పారిశుధ్య కార్మిక నాయకుడు కె.తారకేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు మున్సిపల్‌ మేనేజర్‌ బి.మురళీ మోహన్‌ పట్నాయక్‌కు గురువారం సమ్మె నోటీసు అందజే శారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ కనీస డిమాండ్లను పరిష్కరిం చడంలో ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. కనీసం వేతనం రూ.25 వేలు ఇవ్వాలన్నారు. కరోనా రక్షణకు మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజలు, సబ్బు లు, నూనెలు, చెప్పులు, యూనిఫారాలు నాణ్యమైనవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హెల్త్‌ కార్డులు ఇవ్వాలన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో కె.వెంకటరావు, జె.వాసు, కె.భాస్కరరావు, ఎన్‌.రమ, ఎన్‌.కృష్ణ ఉన్నారు.