Sep 24,2021 01:43

పారిశుధ్య పనులను పరిశీలిస్తున్న కమిషనర్‌

విశాఖపట్నం : పారిశుధ్య కార్మికులు రెండు పూటలా విధులు నిర్వహించాలని జివిఎంసి కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన శానిటరీ సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఆమె 4వ జోన్‌ 32వ వార్డు పరిధిలోని కరణంవారి వీధి, పరిసర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ప్రతి ఇంటి నుండి తడి-పొడి చెత్త సేకరణ చేసి, రోడ్లు, కాలువలు శుభ్రం చేయించాలని శానిటరీ ఇన్స్పెక్టరును ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్‌ కమిషనర్‌ బి.వి.రమణ, ఎఎంఒహెచ్‌ డాక్టరు కిషోర్‌, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, రత్నాల రాజు, టి.పి.ఎస్‌.ఝాన్సి, సహాయక ఇంజినీర్లు ఉషా పాల్గొన్నారు.