Oct 27,2021 22:56

మాట్లాడుతూన్న అనీశా డీఎస్పీ ఎం. సూర్యనారాయణరెడ్డి

- అనీశా డీఎస్పీ ఎం.సూర్యనారాయణరెడ్డి
ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: 
అవసరానికి మించిన ఖర్చులు అవినీతికి కారణం అవుతున్నాయని, పారదర్శకంగా ఉన్నప్పుడే అవినీతిని రూపుమాపవచ్చని జిల్లా అనిశా డీఎస్పీ ఎం.సూర్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాల్లో భాగంగా బుధవారం స్ధానిక సౌజన్య కళ్యాణ మండలంలో అవినీతికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ అవినీతి వల్ల నష్టపోయేది మనమే అన్న భావన ప్రతి ఒక్కరిలోనూ రావాలని, అప్పుడే అవినీతి రహిత సమాజ నిర్మాణం సాధ్యపడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నిరాడంబర జీవితాన్ని అనుభవించిన నాడే అవినీతిని రూపుమాపగలమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ డాక్టర్‌ మహంతి కిషోర్‌కుమార్‌, మార్కాపురం వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు రమాదేవి, మున్సిపల్‌ కమిషనర్‌ సిఎం నయిమ్‌ అహ్మద్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసనాయక్‌, విద్యుత్‌ శాఖ డిఈ శేఖర్‌బాబు, సిఐ బీటీ నాయక్‌, జాయింట్‌ సబ్‌రిజిష్టార్‌-1 నజ్మల్‌ హుస్సేన్‌, ఎస్‌ఐ వై.నాగరాజు, ఎఒ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.