Sep 20,2021 00:51

రోడ్డుకు అడ్డంగా ఉన్న పామాయిల్‌ గెలలు, కాటా

ప్రజాశక్తి-తొండంగి
నిత్యం వందల సంఖ్యలో అన్నవరం నుంచి కాకినాడకు జనం వాహనాలపై ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ మార్గంలో రోడ్డుకు అడ్డంగా పామాయిల్‌ గెలల వేయడం వల్ల ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. రోడ్డు వెంబడి నిత్యం వందల సంఖ్యలో ఆటోలు, లారీలు, కార్లు, బైకులు, కాలినడకన వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పామాయిల్‌ కాటా వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నా ఆర్‌ అండ్‌ బి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా, నిమ్మకు నీరెత్తినట్టు అధికారుల వ్యవహారశైలి ఉంది. గతంలో ఇదే ప్రదేశంలో అనేక ప్రమాదాలు సంభవించాయి. అయినా అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి రోడ్డుకు అడ్డంగా పామాయిల్‌ గెలల కాటా తొలగించి, ప్రయాణికులకు రాకపోకలకు అంతరాయం లేకుండా చేయాలని ప్రజల విన్నవించుకుంటున్నారు.